Machilipatnam క్యాంప్ బెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం మొగ తీరానికి చేరుకున్నారు. తహశీల్దార్ మృత్యుంజయరావు, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారిని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.